
Naga Chaitanya retirement plan:
అక్కినేని వారసుడు Naga Chaitanya ప్రస్తుతం కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. 2022లో ‘బంగార్రాజు’ సినిమాతో హిట్ అందుకున్న తర్వాత, వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఆయన చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తండేల్’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7 విడుదల కానుంది.
తండేల్ ప్రమోషన్‌లో భాగంగా నాగచైతన్య, సాయి పల్లవి తమ అభిమానులతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా సాయి పల్లవి – “ఏ క్యారెక్టర్‌తో నీ లైఫ్ సెట్ చేయాలనుకుంటావు?” అని ప్రశ్నించగా, చైతూ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
చైతూ మాట్లాడుతూ – “నా రిటైర్మెంట్ ప్లాన్ గురించి గతంలో కూడా చెప్పాను. ‘ప్రేమమ్’ సినిమాలో చివర్లో హీరో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి సెటిల్ అవుతాడు. నాకూ అలాగే రిటైర్మెంట్ తర్వాత రెస్టారెంట్ పెట్టి, అందులో చెఫ్‌గా మారి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను.” అని చెప్పాడు.
నాగచైతన్య మంచి వంటకారని అభిమానులకు తెలిసిందే. ఆయనకు “షో యు” అనే క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఉంది. అప్పుడప్పుడూ వంట చేసి తన వంటకాలను అందించేందుకు ఆసక్తి చూపిస్తాడు. ఇక తండేల్ షూటింగ్ సమయంలోనూ యూనిట్ కోసం చేపల కూర వండిన సంగతి తెలిసిందే.
నాగచైతన్య రిటైర్మెంట్ ప్లాన్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “ఇప్పుడే రిటైర్మెంట్ ప్లాన్ ఫిక్స్ చేసుకున్నావా?” అంటూ కొందరు ఆశ్చర్యపోతే, మరికొందరు “ఫ్యూచర్ ప్లాన్ సూపర్” అంటూ ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, సినిమాల కంటే వంటకాలు, రెస్టారెంట్ బిజినెస్ వైపు నాగచైతన్య ఆసక్తి చూపించడంపై అందరిలో ఆసక్తి నెలకొంది.