టాలీవుడ్‌లో అక్కినేనే యువ జంట నాగ చైతన్య, సమంతలకు మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు మొదటిసారిగా ’ఏమాయ చేసావే’లో కలిసి నటించారు. ఫస్ట్ సినిమాతో ఏర్పడ్డ ప్రేమ ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. పెళ్లైన తరువాత వీళ్లిద్దరు తొలిసారి ‘మజిలీ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత సమంత.. ‘ఓ బేబి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. మరోవైపు నాగచైతన్య తన మేనమామ వెంకటేష్‌తో కలిసి నటించిన ‘వెంకీ మామ’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ‘ఏ పిల్ల అనే పాటను మార్చి 11న (బుధవారం) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ.. సమంతకు తామిద్దరం తొలిసారి యాక్ట్ చేసిన ‘ఏమాయ చేసావే’ సినిమాలోని ‘ఈ హృదయం కరిగించి వెళ్లకే’ పాటంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఈ విషన్ని సమంత కూడా ట్విట్టర్ వేదికగా ఔనని చెప్పింది.
ఈ నేపథ్యంలో చైతన్య ఓ ట్వీట్ చేశాడు. మీకు ఇష్టమైన ప్రేమ పాట ఏంటి ? అని నెటిజన్లను ప్రశ్నించగా. ఇక నాకు మాత్రం చాలా ఇష్టమైన ప్రేమ పాటల్లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ లోని వెళ్లిపోమాకే… పాటంటే ఇష్టమని చెప్పాడు. అలాగే మీరు కూడా మీకిష్టమైన పాట ఏమిటో చెప్పండి అని #myfavlovesong అనే ట్యాగ్‌ను ట్వీట్ చేశాడు. ఈ విషయమై చాలా మంది నెటిజన్స్ చైతూకు రిప్లై ఇచ్చారు. అంతేకాదు తమకిష్టమైన పాటలు తెలిపిన వారికి ఓ మరిచిపోలేని సర్ఫ్రైజ్ గిప్ట్ ఉంటుందిని చిత్ర బృందం తెలిపింది.
Wishing you all a safe and happy holi! #AyPilla full lyrical on March 11th at 4:05pm @Sai_Pallavi92 @sekharkammula @Pawanch19 @AsianSunilN @SVCLLP #AmigosCreations @AdityaMusic #LoveStory #NC19 pic.twitter.com/hjoBPffgwe
— chaitanya akkineni (@chay_akkineni) March 10, 2020
Wishing you all a safe and happy holi! #AyPilla full lyrical on March 11th at 4:05pm @Sai_Pallavi92 @sekharkammula @Pawanch19 @AsianSunilN @SVCLLP #AmigosCreations @AdityaMusic #LoveStory #NC19 pic.twitter.com/hjoBPffgwe
— chaitanya akkineni (@chay_akkineni) March 10, 2020