నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఆదివారం రాత్రి జరిగిన ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ.. ‘అక్కినేని… తొక్కినేని’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్ మీడియాలో బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం…’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023