అక్కినేని నాగచైతన్య తాజాగా.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో లవ్ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తరువాత పరుశురాంతో సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది. దాంతో నందినిరెడ్డి తో సినిమా చేస్తున్నాడు చైతన్య. అయితే మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి మర్చిపోలేని హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ తో చైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ మనం తర్వాత ప్రేక్షకుల నాడి పట్టుకోలేక పోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న అవి ఫ్లాప్ అవుతున్నాయి. నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ ‘థాంక్యూ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని విక్రమ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చదిద్దుతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి మరి కొద్ది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది