బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర చేశారు. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య లుక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘లాల్‌సింగ్ చద్దా చెడ్డీ బడ్డీ’ బాలరాజు’ ను మీకు పరిచయం చేస్తున్నా.. అలనాటి బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు) మనవడు మన నాగచైతన్యనే ఈ బాలరాజు’ అని పేర్కొన్నారు చిరంజీవి.
‘లాల్ సింగ్ చడ్డా’, చెడ్డీ బడ్డీ ‘బాలరాజు’ ని మీకు పరిచయం చేస్తున్నాను.
అలనాటి ‘బాలరాజు’ మనవడు మన
అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజు. @chay_akkineniIntroducing #Balaraju
from #LaalSinghChaddha #AamirKhan @AKPPL_Official @Viacom18Studios #LaalSinghChaddhaOnAUG11th pic.twitter.com/1cVgbURrZx— Chiranjeevi Konidela (@KChiruTweets) July 20, 2022