HomeTelugu Reviews'కస్టడీ' మూవీ రివ్యూ

‘కస్టడీ’ మూవీ రివ్యూ

Custody Movie Review

అక్కినేని నాగచైతన్య హీరోగా.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘కస్టడీ’. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలై అప్డేట్స్‌ ఈ సినిమాపై ఆసక్తిని కలించాల ఉన్నాయి. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం..

శివ (నాగచైతన్య) 90వ దశకంలో గోదావరి ప్రాంతంలోని సకినేనిపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్. తాను ప్రేమించిన రేవతి (కృతి శెట్టి)కి బలవంతంగా మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తుండటంతో తనను ఎలా సొంతం చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉంటాడు. ఈ టైమ్‌లో అతడికి రాజు (అరవింద్ స్వామి) అనే పెద్ద రౌడీ కారణంగా మరో తలనొప్పి మొదలవుతుంది. సీఎం స్థాయిలో రాజును టార్గెట్ చేయడంతో అతణ్ని కాపాడి.. బెంగళూరులోని సీబీఐ కోర్టులో హాజరు పరచాల్సిన బాధ్యత శివ మీద పడుతుంది. మరి శివ ఆ బాధ్యతను ఎలా నెరవేర్చాడు.. ఈ క్రమంలో రేవతి సమస్యను ఎలా పరిష్కరించి ఆమెను తన సొంతం చేసుకున్నాడు అన్నది మిగతా కథ.

తమిళంలో వెంకట్ ప్రభు సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. తెలుగులోకి కూడా డబ్‌ అయిన ‘సరోజ’, ‘గ్యాంబ్లర్’ లాంటి సినిమాల్లో ఆయన మార్క్‌ కనిపిస్తుంది. థ్రిల్లర్ కథాంశాలతో.. ఉత్కంఠ రేపుతూనే.. ఇంకోవైపు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వెంకట్ ప్రభు శైలి. దర్శకుడిగా పరిచయం అయి దశాబ్దంన్నర దాటినా.. ఈ దర్శకుడికి మంచి ట్రాక్ ఉంది.. ఇలాంటి దర్శకుడు నాగచైతన్యతో ఒక థ్రిల్లర్ సినిమా తీశాడంటే ఓ రెంజ్‌లో అంచనాలు ఉంటాయి. కానీ వెంకట్ ప్రభు.. ‘కస్టడీ’లో విషయంలో మాత్రం గాడి తప్పాడు. మూడు రోజుల వ్యవధిలో జరిగే కథ.. ఒక క్రిమినల్ ను కాపాడే కానిస్టేబుల్.. ‘కస్టడీ’ గురించి ఈ మాటలు విని.. రియలిస్టిగ్గా సాగే ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాను ఆశిస్తాం కానీ.. ఇదొక కమర్షియల్ సినిమాలా సాగడం ప్రేక్షకుడిని నిరాశకు గురిచేస్తుంది.

custody

ఇక ఈ సినిమాలో.. చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న ఆర్టిస్టులను తీసుకోవడం మరోక మైసన్‌. అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్, ప్రియమణి, జీవా, ఆనంది, రాంకీ, జయసుధ, జయప్రకాష్, ఇలా చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా చెప్పుకోదగ్గ పాత్ర లేదు. కనీసం హీరో పాత్ర కూడా వెంకట్ ప్రభు ఆసక్తికరంగా తీర్చిదిద్దలేకపోయాడు. హీరో పాత్ర ప్రారంభంలో ఇంట్రస్టింగ్‌గా ఉన్న కథ ముందుకు సాగేకొద్దీ రొటీన్ హీరో క్యారెక్టర్లాగే మారిపోతుంది. రొటీన్‌గా సాగిపోతుంది. హీరోయిన్‌కు కథలో ప్రాధాన్యం ఉన్నా సరే.. ఆమె పాత్ర కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. ఈ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రిపీటెడ్ గా అనిపించడంతో ఒక దశ దాటాక విసుగు పుడుతుంది.

ఒక సాధారణ కానిస్టేబుల్.. సీఎం స్థాయి వ్యక్తి ఇరుక్కున్న కేసులో ప్రధాన ఆధారం అయిన నేరస్థుడిని.. మొత్తం వ్యవస్థకు ఎదురు నిలబడి.. రాజమండ్రి దగ్గర్లోని ఒక ఊరి నుంచి బెంగళూరు వరకు తీసుకెళ్లడం ‘కస్టడీ’లో ప్లాట్ పాయింట్. ఈ లైన్ వినడానికి ఆసక్తికరంగానే అనిపిస్తుంది. దీనికి వెంకట్ ప్రభు మార్కు స్క్రీన్ ప్లే తోడైతే ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేవాళ్లే. కానీ వెంకట్ తన శైలి విడిచిపెట్టి సగటు కమర్షియల్ డైరెక్టర్ల స్టైల్ ఫాలో అయిపోయాడు. సినిమా మొత్త ఒక ఫార్మాట్లో సాగిపోతుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్న.. ఓవరాల్ ఇంప్రెషన్ మాత్రం అంత గొప్పగా ఉండదు. ఇక విలన్ పాత్రకు.. హీరో ఫ్లాష్ బ్యాక్ కు ముడిపెడుతూ ఒక సెంటిమెంట్ స్టోరీ నడిపించగా.. అది కూడా రొటీనే అనిపిస్తుంది. ఇప్పటికే ఈ తరహా సినిమాలు తెలుగు చాలా చూశాం. ఇక హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కూడా అంతంత మాత్రం గానే ఉంది.

అరవింద్ స్వామి పాత్ర ప్రవేశంతోనే కథ కొంచెం ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ ముందు కథలో తీవ్రత పెరిగిన.. ద్వితీయార్ధం ప్రేక్షకుల ఊహించే విధంగా రొటీన్ గా సాగిపోతుంది. వెంకట్ ప్రభు ఎంచుకున్న కథేమో.. సరిగ్గా చూపించలేక పోయాడు అని పిస్తుంది. నాగచైతన్య తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. కొన్ని సన్నివేశంలో అతడి నటన ఆకట్టుకుంటుంది. కృతి శెట్టికి పెర్ఫామెన్స్ స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. అరవింద్ స్వామి చేసిన రాజు పాత్ర.. ఆయన స్థాయికి తగ్గది కాదు. ఆరంభంలో ఆ క్యారెక్టర్ని ఏదో ఊహించుకుంటాం కానీ.. చివరికి అది రొటీన్ గా ముగుస్తుంది. శరత్ కుమార్ పాత్ర, రాంకీ, ప్రియమణి లకు సరైన పాత్రలు లంభించలేదు. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించాడు. సంపత్, జయప్రకాష్, గోపరాజు రమణ, వీళ్లంతా తమ పరిధిలో బాగానే నటించారు. నేపథ్య సంగీతం పర్వాలేదు.

టైటిల్‌ :’కస్టడీ’ మూవీ రివ్యూ
నటీనటులు: నాగచైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: వెంకట్ ప్రభు
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి
సంగీతం: ఇళయరాజా-యువన్ శంకర్ రాజా

చివరిగా: బోరింగ్‌ మూవీ

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu