HomeTelugu Trendingకస్టడీ: గ్లింప్స్‌ విడుదల

కస్టడీ: గ్లింప్స్‌ విడుదల

Naga chaitanya custody movi

అక్కినేని నాగచైత‌న్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో NC 22గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుండి నూతన సంవత్సర కానుకగా కస్టడీ క్రేజీ అప్‌డేట్‌ అందించారు మేకర్స్. గ్లింప్స్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు. ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలతో సాగుతున్న గ్లింప్స్ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో కృతిశెట్టి మరోసారి నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా ప్రీ లుక్‌ పోస్టర్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో శివ అనే పోలీసాఫీసర్‌గా నాగచైత‌న్య కనిపించనున్నాడు. అరవింద్‌ స్వామి ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్, ప్రియమణి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu