HomeTelugu Big Storiesనాగ్‌ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు: సమంత

నాగ్‌ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు: సమంత

4 21టాలీవుడ్‌లో స్వీట్‌ కపుల్‌ నాగచైతన్య-సమంత. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా నాగచైతన్యను ఉద్దేశిస్తూ సమంత పెట్టిన పోస్ట్‌పై అటు సినీ ప్రముఖులు, ఇటు అక్కినేని అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శనివారం చై పుట్టినరోజు. ఈ సందర్భంగా సమంత ఇన్‌స్టా వేదికగా నాగచైతన్యతో దిగిన ఫొటోలను షేర్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

‘నా చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు సంతోషంగా ఉండాలని నేను ప్రతిరోజూ ప్రార్థిస్తుంటాను. గడిచిపోతున్న రోజును చూసి నేను ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఎందుకంటే నీ బెస్ట్‌ వెర్షన్‌గా నువ్వు ఎదుగుతున్నావు. మనమిద్దరం ఒకటిగా ఉంటే మరింత స్ట్రాంగ్‌గా ఉంటామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ లవ్‌యూ డార్లింగ్‌.’ అని సమంత పోస్ట్‌ పెట్టారు.

కాగా సమంత షేర్‌ చేసిన ఫొటోలు చూసిన పలువురు సినీ ప్రముఖులు ఈ పోస్ట్‌పై స్పందించారు. చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘నాకెంతో ఇష్టమైన జంట’ అని రకుల్‌ అన్నారు. నందినిరెడ్డి, స్వప్నాదత్‌లు.. చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.’

Recent Articles English

Gallery

Recent Articles Telugu