HomeTelugu Trending'లవ్ స్టోరీ' నుండి నాగచైతన్య బర్త్‌డే గిఫ్ట్‌

‘లవ్ స్టోరీ’ నుండి నాగచైతన్య బర్త్‌డే గిఫ్ట్‌

Naga chaitanya love story
అక్కినేని నాగచైతన్య , సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా దీన్ని విడుదల చేస్తున్నట్లు శేఖర్ కమ్ముల చెప్పారు. లుంగీ, బనియన్ వేసుకుని నాగచైతన్య పల్లెటూరి యువకుడిలా కనపడుతున్నాడు. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్, తిరిగి ఈమధ్యే పూర్తయింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్, తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. నాగచైతన్య , సాయి పల్లవి ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనపడతారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu