కరోనా విజృంభించిడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో అందరు ఇంటికే పరిమితం అయ్యారు. సెలబ్రెటీలు సైతం తమ ఇంట్లోనే ఉంటు అభిమానులతో సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటున్నారు. ఈ సమయంలో సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. నాగ చైతన్య హెల్మెట్ పెట్టుకొని బైక్ పై రెడీగా ఉండగా సామ్ మరో హెల్మెట్ పట్టుకొని వెనుక కూర్చొని ఉంది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. లాక్‌డౌన్ కొనసాగుతుంటే ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. చెయ్ – సామ్ ఇద్దరూ కలిసి బైక్ మీద షికార్లు కొట్టొస్తామంటే పోలీసులు ఊరుకుంటారా ఏంటి అని మరొకరు. బహుశా ఇది పాత ఫోటో అయ్యుంటుందని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి తరువాత కూడా ఈ జంట వరుస విజయాలతో దూసుకుపోతున్నారు,