Rana Daggubati Celebrity Talk Show:
హీరోగా, విలన్ గా, నిర్మాతగా, ప్రజెంటర్ గా.. ఇలా ఇండస్ట్రీలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలో తనదైన ముద్ర వేసుకుంటూ.. కెరియర్ లో ముందుకు దూసుకు వెళుతున్న Rana Daggubati నంబర్ వన్ యారీ అనే సెలబ్రిటీ టాక్ షో తో హోస్ట్ గా కూడా మారారు. ఇప్పటికే ఈ సెలబ్రిటీ టాక్ షో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తిచేసుకుంది.
తాజాగా ఇప్పుడు రానా హోస్ట్ గా మరో కొత్త ప్రాజెక్ట్ కోసం.. సిద్ధమవుతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంటోంది. ఇది కూడా ఒక సెలబ్రిటీ టాక్ షో అని, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది అని సమాచారం. ఈ కొత్త షో కోసం రానా దగ్గుబాటి పలు పాపులర్ సెలబ్రిటీలతో కలిసి.. వారితో ఎన్నో కబుర్లు చెప్పనున్నారు.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ, శ్రీలీల, నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, సిద్దు జొన్నలగడ్డ లాంటి స్టార్లు ఈ షోలో గెస్ట్ లుగా పాల్గొనబోతున్నారట. ఈ జాబితాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పేర్లు నాగచైతన్య, శోభిత ధూళిపాళ. చాలాకాలం సీక్రెట్ గా ప్రేమాయణం నడిపిన వీరిద్దరూ.. ఈ మధ్యనే నిశ్చితార్థంతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
అయితే ఈ విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితం గురించి నాగచైతన్య చాలా విషయాలు సీక్రెట్ గానే ఉంచారు. అందులో శోభిత ధూళిపాళ్లతో తన ప్రేమాయణం కూడా ఒకటి. విడాకుల తర్వాత కొద్ది రోజులకి వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుంది అంటూ.. చాలా వార్తలు బయటకు వచ్చాయి. ఎప్పటికప్పుడు కెమెరా కంటికి చిక్కుతూనే వచ్చిన ఈ జంట.. అధికారికంగా మాత్రం తమ రిలేషన్ షిప్ గురించి నిశ్చితార్థం రోజే బయటపెట్టారు.
Read More: Bigg Boss 8 Telugu ఇంటి నుండి ఈవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వనున్నారా?
అయితే తాజాగా ఇప్పుడు రానా దగ్గుబాటి షో కి గెస్ట్ లుగా వస్తున్న వీళ్ళిద్దరూ తమ వ్యక్తిగత జీవితం గురించి కూడా.. ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టబోతున్నారు అని.. వార్తలు వినిపిస్తున్నాయి. పైగా తన తల్లి వైపు నుంచి రానా కూడా నాగచైతన్య కుటుంబ సభ్యుడే. ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో రానా షో కోసం నాగచైతన్య.. తన సీక్రెట్ ప్రేమ గురించి బోలెడు విషయాలు చెప్పే అవకాశం ఉందని.. ఫాన్స్ అంటున్నారు.