అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా టైటిల్ ఖరారైంది. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. సాయి పల్లవి లుక్‌ను కూడా రివీల్ చేశారు. ప్రచార చిత్రంలో సాయిపల్లవి.. చైతన్య చొక్కాను పట్టుకుని భావోద్వేగానికి గురౌతూ కనిపించారు. ఆకట్టుకునేలా ఈ పోస్టర్‌ను రూపొందించారు.
‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. వేసవిలో కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరోపక్క వరుస హిట్లతో ఉన్న చైతన్య ఎంచుకున్న కథ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.