Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య హీరోయిన్ 2018లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పలు కారణాల వల్ల ఈ జంట 2021లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. అప్పటి నుంచి సమంత, నాగ చైతన్య సింగిల్ గానే ఉంటున్నారు. కాగా సమంత సినిమాలను కాస్తా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరైన కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తుంది.
నాగ చైతన్య మాత్రం ‘తండేల్’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా షూటింగ్లకు గ్యాప్ దొరకడంతో నాగ చైతన్య సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేశాడు. వెకేషన్కు సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ..ఆ ఫొటోని హీరోయిన్ శోభిత ధూళిపాళ లైక్ చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
శోభిత ధూళిపాళ, నాగ చైతన్యల మధ్య ఎఫైర్ ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. శోభిత ధూళిపాళ కారణంగానే సమంత నాగ చైతన్యకు విడాకులిచ్చిందనే రూమర్ ఇండస్ట్రీలో ఉంది. సమంతతో విడాకులు అనంతరం శోభిత ధూళిపాళతో కలిసి నాగ చైతన్య విదేశాల్లో దర్శనం ఇచ్చాడు. శోభిత ధూళిపాళ్లను తరచుగా కలుస్తున్న నాగ చైతన్య తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి తీసుకువెళ్లేవాడని తెలిసింది.
ఈ క్రమంలో కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లకు బలం చేకూర్చేలా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. లండన్ వెళ్లిన నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ్ల కనిపించింది. అక్కడి ఇండియన్ రెస్టారెంట్ కి వీరు వెళ్లారు. చెఫ్ నాగ చైతన్యతో సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో దూరంగా కూర్చుని ఉన్న శోభిత ధూళిపాళ్ల కూడా కనిపించింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు ఫోటోని ఆ చెఫ్ డిలీట్ చేశాడు. అలాగే వీరిద్దరూ విదేశాల్లో పక్కపక్కనే నిల్చుని దిగిన ఫోటో కూడా ఒకటి వైరల్ అయ్యింది.
ఈ క్రమంలో నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారనే అనుమానాలు బలపడ్డాయి. తాజాగా నాగ చైతన్య ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఆయన సాయంత్రపు సూర్యకిరణాలు ఆస్వాదిస్తున్న ఫోటో పెట్టారు. ఈ సాదాసీదా ఫోటోపై శోభిత ధూళిపాళ్ల స్పందించింది. ఒక లైక్ కొట్టింది. ఇది శోభితతో నాగ చైతన్య రిలేషన్లో ఉన్నాడన్న వార్తలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చినట్లు అయింది.
నాగచైతన్య వెకేషన్కు శోభితను కూడా తీసుకెళ్లాడని ఆమె పక్కనే ఉండొచ్చనే నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నాగ చైతన్య రెండో భార్యగా శోభిత ధూళిపాళను చూడవచ్చని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల మీద వచ్చే ఈ రూమర్స్ ని ఆయన టీమ్ ఖండిస్తున్నారు. నాగ చైతన్య మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎప్పుడూ దీనిపై ఆయన స్పందించలేదు.