HomeTelugu Big Storiesఉపాసనపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఉపాసనపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Naga babu comments on Upasa
మెగా బ్రదర్‌ నాగబాబు రామ్‌చరణ్ భార్య ఉపాసనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాసన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో సామాజిక అంశాల పై స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు హెల్త్ తో పాటు తన కుటుంబ విషయాలు కూడా తెలియజేస్తూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ కోడలిగా ఇంటి బాధ్యతలతో పాటు అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది. అంతేగాక తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ తనకు తెలిసిన చిట్కాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.

తాజాగా నాగబాబు ఉపాసన గురించి మాట్లాడుతూ.. “ఉపాసన అంతపెద్ద అపోలో హాస్పిటల్స్ నుండి కరోనా టైంలో చాలా తక్కువ ఖర్చులకు ట్రీట్మెంట్ అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపాడు. అలాగే అంత తక్కువ ఖర్చుకు ఎలా సాధ్యం అవుతుందని అడిగితే.. ఇలాంటి సమయంలోనే కదా సహాయం చేయాల్సింది అంటూ చెప్తే ఆమె గొప్పతనం అర్థమై చాలా ఆనందంగా ఫీల్ అయినట్లు చెప్పాడు. ఆ విధంగా మెగాస్టార్ కోడలు అనిపించుకుంది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే సినీ కార్మికులకు వాక్సినేషన్.. కార్యక్రమంలో కూడా ఉపాసన హెల్ప్ ఉందని తెలిపాడు. అయితే ఉపాసన సేవాగుణం గురించి ఆల్రెడీ జనాలకు మెగా అభిమానులకు తెలిసిందే. ఆమె కరోనా టైంలో శ్రీశైలం పరిసరాల్లోని గిరిజనులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu