HomeTelugu Newsఏడున్నరేళ్ల నా 'జబర్దస్త్‌' జర్నీ ముగిసింది: నాగబాబు

ఏడున్నరేళ్ల నా ‘జబర్దస్త్‌’ జర్నీ ముగిసింది: నాగబాబు

15aబుల్లితెర తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న కామెడీ షోలు ‘జబర్దస్త్‌’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. గురు, శుక్రవారాలు వచ్చాయంటే తెలుగు వాళ్లందరూ టీవీల ముందు వాలిపోతారు. ఇక బస్సుల్లో, రైళ్లలో ఎక్కడికి ప్రయాణం చేసినా, ఎవరో ఒకరు యూట్యూబ్‌లో ‘జబర్దస్త్‌’ను చూస్తూనే ఉంటారు. అలాంటి ‘జబర్దస్త్‌’కు క్రేజ్‌ తీసుకురావడంతో తమ వంతు పాత్ర పోషించిన వ్యక్తులు, ఆ షో న్యాయ నిర్ణేతలు నాగబాబు, రోజా. ఇప్పుడు ఈ షో నుంచి సినీ నటుడు నాగబాబు తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. తాను షో నుంచి వెళ్లిపోవడం గురించి సినీ ఇండస్ట్రీ, సామాజిక మాధ్యమాల వేదికగా అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై నాగబాబు స్పష్టతనిచ్చారు.

”జబర్దస్త్‌” ఒక సుదీర్ఘ ప్రయాణం. 2013 నుంచి 2019 ఈ రోజు వరకూ నా ప్రయాణం కొనసాగింది. ఇది నాకు హ్యాపీ, ఎమోషనల్ జర్నీ. నేను ‘జబర్దస్త్‌’ మానేయడానికి ఏవేవో కారణాలు బయటకు వస్తున్నాయి. ఊహాజనిత వార్తలు సృష్టించడం నాకు ఇష్టం లేక మాట్లాడాల్సి వస్తోంది. ఏదైనా విషయాన్ని వివాదాస్పదం చేయడం నాకు ఇష్టం ఉండదు. అలా చేసి నేను పొందే లాభం కూడా లేదు. ‘జబర్దస్త్‌’కు వ్యతిరేకంగా ఇప్పటివరకూ నేను బయట మాట్లాడింది లేదు. ఈరోజు, రేపటి ఎపిసోడ్‌లతో ‘జబర్దస్త్‌’లో నా ప్రయాణం ముగిసింది. ఇక నుంచి నేను కనిపించను. ఈ షోను నాకు నేనుగా మానేసే పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఒక కార్యక్రమం అయినా, జర్నీ అయినా ఎక్కడో ఒక చోట పూర్తి కావాలి. మల్లెమాల శ్యాంప్రసాద్‌గారితో నాకు ఎలాంటి విభేదాలు లేవు. కేవలం అవి ఆలోచనాపరమైన విభేదాలు అనవచ్చు. ముఖ్యంగా అవి వ్యాపారానికి సంబంధించినవి. శ్యాంప్రసాద్‌రెడ్డిగారికి, ఈటీవీ వారికి కృతజ్ఞతలు.”

15 6

”ఏడున్నరేళ్ల పాటు ఈ జర్నీ సాగడం ఒక రికార్డు. ‘జబర్దస్త్‌’ చేసే సమయానికి నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ షో నాకు చాలా సాయం చేసింది. ఇందుకు కారణం శ్యాంప్రసాద్‌గారే. కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. నవ్వించే వాళ్లంటే నాకు ఇష్టం. ప్రతి ఒక్కరూ అలాగే ఆలోచిస్తారు. అందుకే ‘జబర్దస్త్‌ ఒప్పుకొన్నా. నేను జబర్దస్త్‌ నుంచి బయటకు రావడానికి కారణం వ్యాపారానికి సంబంధించిన ఆలోచనా పరమైన విభేదాలు మాత్రమే. రెమ్యునరేషన్‌ విషయంలో వివాదం వచ్చి బయటకు వచ్చానని అందరూ అనుకుంటున్నారు. కానీ, రెమ్యునరేషన్‌ అనేది నాకు పెద్ద విషయం కాదు. బయటకు అనుకుంటున్నవేవీ నిజం కాదు. ‘జబర్దస్త్‌’లో ఉండటానికి, ఇప్పుడు వెళ్లిపోవడానికి పారితోషికం అసలు ప్రామాణికం కానే కాదు. ఏదేమైనా ‘జబర్దస్త్‌’లో నా ప్రయాణం అద్భుతంగా సాగింది” అని చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu