అక్కినేని నాగార్జున కెరీర్లో ‘మన్మథుడు’ చిత్రం చాలా ప్రత్యేకం. ఈ సినిమాతో నాగార్జున స్టార్ స్టేటస్, మార్కెట్ రేంజ్ బాగా పెరిగాయి. త్రివిక్రమ్ రచనలో, విజయ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని నాగ్ చాలా కాలం నుండి అనుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ కు దర్శకుడు ఫైనల్ అయ్యాడని తెలుస్తోంది. అతనే ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న హీరో రాహుల్ రవీంద్రన్. ఒకవేళ ఆ వార్త నిజమే అయితే కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న రాహుల్ ఈ క్లాసిక్ కు సరితూగే సీక్వెల్ తీయగలడని నాగ్ నమ్మడం ఒకరకంగా సాహసమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.