స్వర్గీయ అక్కినేని నాగేశ్వరావు వెండితెరపై కనిపించనున్నారనేది తాజా సమాచారం. అసలు
విషయంలోకి వస్తే నాగార్జున ప్రధాన పాత్రలో హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా రాఘవేంద్రరావు
దర్శకత్వంలో ‘నమో వెంకటేశాయ’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మూడు నిమిషాల
నిడివి గల పాత్రలో అక్కినేని నాగేశ్వరావు కనిపించనున్నారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీను
ఉపయోగించి గ్రాఫిక్స్ రూపంలో ఆయనకు వెండితెరపై కనపడేలా చేయనున్నారు. ఇప్పటికే దీనికి
సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. కన్నడలో నాగాభరణం సినిమాలో కూడా చనిపోయిన
విష్ణువర్ధన్ ను హీరోగా చూపించబోతున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది.
అలానే ఇప్పుడు ఏఎన్నార్ ను కూడా చూపించబోతున్నారు. ఇది ఆయన అభిమానులకు ఆనందం
కలిగించే విషయమే.