HomeTelugu Big StoriesNag Ashwin: ప్రభాస్ మీద కామెంట్లకి భిన్నంగా రియాక్ట్ అయిన డైరెక్టర్

Nag Ashwin: ప్రభాస్ మీద కామెంట్లకి భిన్నంగా రియాక్ట్ అయిన డైరెక్టర్

Nag Ashwin Latest Interview compares Salaar with Game of Thrones
Nag Ashwin’s shocking movie in Arshad Warsi controversy

Nag Ashwin about Arshad Warsi:

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా మొత్తం వినిపిస్తున్న ఒకే ఒక్క బాలీవుడ్ నటుడి పేరు అర్షద్ వార్సి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కల్కి సినిమా తనకు నచ్చలేదు అని.. అందులో ప్రభాస్ జోకర్ లా కనిపించారు అని ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభాస్ కి మద్దతుగా నిలిచారు.

అయితే తాజాగా ఇప్పుడు సినిమాకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ దీని గురించి రియాక్ట్ అయ్యారు. ఆయన షాకింగ్ రెస్పాన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నాగ్ అశ్విన్ తన స్వీట్ రెస్పాన్స్ తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. X వేదికగా ఒక పోస్టుకు స్పందిస్తూ, “బాలీవుడ్ టాలీవుడ్ అని లేదు.. మనకు ముందు ఉన్నది ఒకే పెద్ద భారతీయ సినీ పరిశ్రమ. అర్షద్ సాబ్ కొంచెం జాగ్రత్తగా మాటలు వాడాల్సింది. కానీ, అది పర్వాలేదు. ఆయన పిల్లలకు కొన్ని బుజ్జి బొమ్మలు పంపించాను.. ఫస్ట్ డే ఫస్ట్ షోకి ప్రభాస్ అద్భుతంగా ఉన్నారు అని ఫ్యాన్స్ చెప్పేలా శ్రమిస్తాను” అని అన్నారు.

నాగ్ అశ్విన్ ఈ విధంగా వివాదాన్ని సున్నితంగా డీల్ చేయడం మీద అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది ఈ పోస్టును షేర్ చేసి, లైక్స్ చేశారు. “ప్రపంచంలో ఉన్న ద్వేషం చాలు.. మనం దాన్ని పెంచకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రభాస్ గారు కూడా ఇలానే అనుకుంటారని నాకు తెలుసు” అని నాగ్ అశ్విన్ తన పోస్టులో వివరించారు.

అంతే కాకుండా కల్కి 2898AD రెండవ భాగంలో ప్రభాస్ నటన అద్భుతంగా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇచ్చిన హామీ కూడా ప్రభాస్ అభిమానులకు చాలా ఆనందాన్నిచ్చింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu