
Nag Ashwin Latest Interview:
మహానటి, కల్కి 2898 ఎ.డి. సినిమాలతో భారీ హిట్‌లు కొట్టిన నాగ్ అశ్విన్ చాలా సింపుల్‌గా ఉంటారు. స్టార్స్‌తో పనిచేస్తూ కూడా ఏమైనా సాధారణ మనిషిలా కనిపిస్తారు. ఇటీవలి ఓ ఈవెంట్‌లో ఆయన పబ్లిక్‌గా కనిపించడం చాలా అరుదు. అక్కడ కొంత మంది ఫ్యాన్స్‌తో మాట్లాడారు కూడా.
వారిలో ఒకరు అడిగారు, “మీకు ఏదైనా సినిమాలు ‘ఇది నేనే డైరెక్ట్ చేస్తే బాగుండేది’ అనే ఫీలింగ్ వచ్చినవీ? ఏమన్నా ఉన్నాయా”? దానికి నాగ్ అశ్విన్ సమాధానం వైరల్ అయ్యింది. “నిజంగా అలాంటిదేమీ ఫీలింగ్ రాలేదు. కానీ కొన్ని సినిమాలకి ఎడిటర్‌గా ఉండాలనిపించింది,” అన్నారు.
ఆయన చెప్పిన సినిమాల్లో రెండు పేర్లు ప్రత్యేకంగా నిలిచాయి – మహేష్ బాబు నటించిన ఖలేజా, విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్.
“ఈ సినిమాలకి మంచి కంటెంట్ ఉంది. కానీ కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు. ఐతే ఎడిటింగ్‌లో ఇంకొంచెం పని చేస్తే వేరే ఫలితం వచ్చుండేదేమో అనిపిస్తుంది,” అని అన్నారు.
నాగ్ అశ్విన్ ఖలేజా పేరు చెప్పగానే, అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లు కొడుతూ స్పందించారు. ఇది ఇప్పటికీ ఎంతోమందికి ఫేవరెట్ అనే విషయం మరోసారి తెలిసిందే.
ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ అలియా భట్‌తో నాగ్ అశ్విన్ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడన్న రూమర్లు షికార్లు చేస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
కల్కి 2898 AD పార్ట్ 2 విషయానికి వస్తే, అది కొంత టైం పడేలా కనిపిస్తోంది. స్క్రిప్ట్ పనులు పూర్తయిన తర్వాతే సెట్స్‌పైకి వెళ్తుందట.