Nag Ashwin Latest Interview:
ఈ మధ్యనే కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని స్టార్ డైరెక్టర్ అయిపోయిన నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నారు. కల్కి రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ని కర్ణుడి పాత్రలో చూడడానికి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగ్ అశ్విన్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ప్రభాస్ సినిమాలలో తనకి సలార్ సినిమా చాలా ఇష్టం అని అన్నారు నాగ్ అశ్విన్. సలార్ సినిమా అమెరికన్ సిరీస్ గేమ్ ఆఫ్ త్రోన్స్ లాగా ఉంటుంది అని అన్నారు నాగ్ అశ్విని.
కల్కి 2 లాగనే సలార్ 2, పుష్ప 2 వంటి కొన్ని సూపర్ హిట్ సినిమాల రెండవ భాగాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. అందులో ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అని అడగగా సలార్ 2 సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.
“సలార్ క్లైమాక్స్ లో ప్రభాస్ శత్రువుల తరపు వాడు అని ఒక రెవలేషన్ ఉంటుంది. అది చాలా అద్భుతంగా అనిపించింది. అందుకే సలార్ 2 కోసం ఎదురుచూస్తున్నాను. పైగా ప్రభాస్ సినిమా కాబట్టి నాకు కొంచెం బయాస్ ఉంది” అన్నారు నాగ్ అశ్విన్.
నాగ్ అశ్విన్ తో పాటు ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా విడుదలైన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అప్పటిదాకా వరుస డిజాస్టర్లు అందుకుంటున్న ప్రభాస్ కి ఈ సినిమా మర్చిపోలేని హిట్ అందించింది. ఇక ఆ సినిమా రెండవ భాగం ఎలా ఉంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.