HomeTelugu Newsనడీగర్‌ సంఘం ఎన్నికలు రద్దు

నడీగర్‌ సంఘం ఎన్నికలు రద్దు

13 11ప్రతిష్టాత్మకంగా మారిన దక్షిణ భారత నటీనటుల సంఘం (నడీగర్‌) ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన నడిగర్‌ ఎన్నికలను తమిళనాడు రిజిస్టార్‌ ఆఫ్‌ సొసైటీస్‌ బుధవారం నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నడిగర్‌ ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతున్న నాజర్‌-విశాల్‌, భాగ్యరాజ్‌-ఈశ్వరి గణేషన్‌ గ్రూపులు.. ఒక్కసారిగా ఎన్నికలు రద్దవ్వడంతో బిత్తరపోయాయి.

నడిగర్‌ సంఘం నుంచి బహిష్కరించబడిన 61 మంది సభ్యుల ఫిర్యాదు మేరకు రిజిస్టార్‌ ఆఫ్‌ సొసైటిస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫిర్యాదుపై మరింత విచారణ జరిపి.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయిస్తామని ప్రకటించింది. నాజర్‌-విశాల్‌కు చెందిన పాండవర్‌ అని గ్రూప్‌ తమను నడిగర్‌ సంఘం ఓటర్ల జాబితా నుంచి ఆ కారణంగా తొలగించిందని, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తమపై బహిష్కరణ వేటు వేసిందని 61 మంది సభ్యులు ఫిర్యాదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu