Nikhil Swayambhu:
కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఆ సినిమా తర్వాత విడుదలైన 18 స్టేజెస్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నిఖిల్ చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో స్వయంభు కూడా ఒకటి.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న స్వయంభూ సినిమా ఒక మైథాలజికల్ పీరియాడిక్ సినిమాగా త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. నభ నటేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు నాభ నటేష్ హీరోయిన్ గా ప్రియదర్శి హీరోగా నటించిన డార్లింగ్ సినిమా ఈవారం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న నభ నటేష్. పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటుంది. అందులో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నభ స్వయంభూ సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్వయంభు సినిమా ఒక్క పార్ట్ తో ఎండ్ అవదట. డైరెక్టర్ కథ చెబుతున్నప్పుడే మూడు నాలుగు భాగాలకు సరిపడా కథ ఉన్నట్లు కూడా చెప్పారట. అయితే అందులో కనీసం రెండు భాగాలైనా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చింది నభ నటేష్. ఈమధ్య ప్యాన్ ఇండియా సినిమాలన్నీ రెండు మూడు పార్టులుగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
కానీ అభిమానులు మాత్రం రెండవ భాగం కోసం ఎదురు చూస్తూ సమయాన్ని గడపాల్సి వస్తుంది. దీంతో నిఖిల్ అభిమానులు ఈ విషయంలో షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. కార్తికేయ 2 సక్సెస్ తర్వాత నిఖిల్ స్టేటస్ , స్టార్ డం, మార్కెట్ కూడా పెరిగిపోయింది ఈ నేపథ్యంలోనే ఈ సినిమాని కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు.