ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా సత్తా చాటడానికి ఈ భామ రెడీ అవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నభా నటేష్ ఇప్పుడు కోలీవుడ్ అరంగ్రేటం చేయడానికి కూడా రెడీ అయిపోతోందట. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఒక వెబ్ సిరీస్ లో బీటౌన్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కు జంటగా నటించనుంది. ఈ వెబ్ సిరీస్ తోనే హృతిక్, నభా ఇద్దరూ ఓటిటి అరంగ్రేటం చేయబోతున్నారు. ప్రశంసలు పొందిన బ్రిటిష్ స్పై థ్రిల్లర్ సిరీస్ “ది నైట్ మేనేజర్”కు అధికారిక రీమేక్ ఈ వెబ్ సిరీస్.
ఇలా బాలీవుడ్ అవకాశం వచ్చిందో లేదో నభాకు కోలీవుడ్ లో కూడా కాలుపెట్టే ఛాన్స్ వచ్చిందట. ఈ యంగ్ బ్యూటీ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఓ భారీ చిత్రంలో నటించనుందట. నభా తొలి తమిళ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. బెంగుళూరు బ్యూటీ నభా కన్నడ చిత్రం “వజ్రకాయ”తో వెండితెర ప్రవేశం చేసింది.