హిందీ బుల్లితెర నటుడు, నాగిని ‘3’ సీరియల్ ఫేం పరల్ వీ పూరి అత్యాచారం, వేధింపుల కేసులో అరెస్టు అయ్యాడు. తనను కిడ్నాప్ చేసి కారులో తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడని, అంతేగాక తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్వానీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 16 ఏళ్ల బాలికపై దారుణానికి పాల్పడిన పరల్ వి పూరితో పాటు అతడి ఆరుగురు స్నేహితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం వారంతా కస్టడీలో ఉన్నారని, వారిని విచారిస్తున్నట్లు అధికారిక మీడియాకు వెల్లడించారు. అయితే బాధితురాలు తన కుటుంబంతో కలిసి శుక్రవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అదే రోజు(జూ 4) రాత్రి నటుడు పరల్ వీ పూరితో పాటు అతడి స్నేహితులను అరెస్టు చేసినట్లు సదరు అధికారి తెలిపారు. 2013లో దిల్ కీ నజర్ సే ఖూబ్సూరత్ అనే సీరియల్తో టీవీ అరంగేట్రం చేశాడు పర్ల్ వీ పూరి. ఆ తర్వాత నాగిన్ 3తో పాపులర్ అయ్యాడు. తాజాగా బ్రహ్మరాక్షస్-2లో నటించాడు.