అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఎంటర్‌టైనింగ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ బిన్నీ దర్శకత్వం లో వస్తున్న ఈసినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి14న విడుదల కానుంది.
ఈ క్రమంలో ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదలైంది. ఈట్రైలర్ సంక్రాంతి వైబ్స్‌తో అదిరిపోయింది. ఈసారి పండక్కి నా సామిరంగ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో ట్రైలర్ మొత్తం మారుమాగుపోయింది.
ఈ సినిమాలో యంగ్ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ,అషికా రంగనాథ్, రుక్సర్ ధిల్లాన్, మిర్ణా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం పై భారీ హైప్స్ ఉన్నాయి.