HomeTelugu Big Storiesనా సామిరంగ హిట్టు బొమ్మ.. ట్విట్టర్‌ రివ్యూ

నా సామిరంగ హిట్టు బొమ్మ.. ట్విట్టర్‌ రివ్యూ

naa saami ranga movie revie

అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. మాస్, యాక్షన్, రొమాంటిక్ జోనర్‌లో వచ్చిన ఈసినిమా తో కొరియోగ్రాఫర్‌ విజయ్ బిన్ని తొలిసారి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇప్పటికే నాగార్జున పలువురు కొరియోగ్రాఫర్స్‌కి దర్శకులుగా అవకాశం ఇచ్చి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేశారు. ఇదివరకు మాస్ మూవీతో రాఘవ లారెన్స్‌ను దర్శకుడిగా నాగార్జున పరిచయం చేసిన విషయం తెలిసిందే.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నా సామిరంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున్‌కు జోడిగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో నాగ్‌తో పాటు టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సార్ ధిల్లాన్, మిర్నా మీనన్ సైతం ప్రధాన పాత్రలు పోషించారు. వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.

భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నేడు (జనవరి 14)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ ద్వారా తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి ఆర్ఆర్ అదిరిపోయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. క్రీమ్ మామ డ్యూటి అరాచకం అంటూ ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్‌కు రెండు ఫైర్ ఎమోజీస్ యాడ్ చేశాడు.

naa saami ranga 1

“నాగ్ ఇంట్రడక్షన్, అల్లరి నరేష్ పర్ఫామెన్స్, నాగార్జున-ఆషికా రంగనాథ్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా ఎమోషనల్‌గా ఉంది. స్క్రీన్‌పై పాటలు బాగున్నాయి. అన్ని కరెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఇక ఆడియెన్స్ చేతుల్లో ఉంది రేంజ్. నా సామిరంగ హిట్టు బొమ్మ” అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు.

“నాగార్జున నా సామిరంగ సినిమా ఇప్పటికే రూ. 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి పోయింది. ఏపీ మొత్తం ఎక్సలెంట్ బుకింగ్స్ అయ్యాయి. హైదరాబాద్‌లో కూడా బుకింగ్స్ బాగున్నాయి. ఒక చిన్న పాజిటివ్ టాక్ చాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి” అని ఒక యూజర్ చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu