స్టార్ హీరోయిన్ సమంత- రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషీ’. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నాడు. ఈ రోజు (మే 9) విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ‘నా రోజా నువ్వే’ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. మొత్తం ఐదు భాషల్లో ఈ పాట వచ్చింది. ఈ సాంగ్ లో సమంత విజయ్ ఇద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.
‘నా రోజా నువ్వే’ పాటకు లిరిక్స్ డైరెక్టర్ శివ నిర్వాణ అందించడం విశేషం. ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వాహాబ్ ఆలపించారు. ఈ సినిమాకి హేషామ్ సంగీత అందిస్తున్నారు. ఈ సాంగ్ లో సమంత కశ్మీరీ ముస్లిం యువతిగా కనిపిస్తోంది.
వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ వ్యవహారమే నేపథ్యంగా ఖుషీ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ..జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, తదితరులు నటిస్తున్నారు. పీటర్ హెయిన్ ఫైట్స్ అందిస్తున్నారు. జి. మురళి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు