పవన్‌కల్యాణ్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్‌లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్ మేడ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదలచేసింది. ఈ చిలాత్రానికి సంబంధించి ఈ ఏడాది ఉగాది రోజున ఫస్ట్ లుక్ విడుదల చేయాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ అవుతున్న ఫొటో, వార్తలు అవాస్తవం. సినిమాకు సంబంధించిన అప్డేట్ వార్తలు అధికారిక ఖాతాల ద్వారా సరైన సమయంలో వెల్లడిస్తామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.