టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’. యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా బస్తీ బాలరాజు మాస్ ఇంట్రో సాంగ్ మై నేమ్ ఈజ్ రాజు పాట లిరికల్ వీడియో విడుదల చేశారు. రేవంత్ పాడిన ఈ పాట ఆకట్టకుంటుంది. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. సమ్మర్‌కు మూవీని రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.