ప్రముఖ నటుడు, డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపిన విషయం రాఘవ లారెన్స్‌కు సంబంధించిన ట్రస్ట్‌కు చెందిన చిన్నారులందరూ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని ఆయన తెలిపాడు. లారెన్స్ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కొవిడ్-19 ఉన్నట్లు వైద్యులు ఇటీవల నిర్ధారించారు. ఇప్పుడు వారంతా కోలుకోవడంతో లారెన్స్ సంతోషం వ్యక్తం చేశాడు.
‘నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్ బారినపడిన విషయం తెలిసిందే. కొవిడ్-19 నుంచి కోలుకోవడంతో తాజాగా వాళ్లని డిశ్చార్జ్ చేశాడు. ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వెలుమణిగారికి, మంత్రివర్యులు జి. ప్రకాశ్‌గారికి, అలాగే డాక్టర్స్, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం..`అని రాఘవ లారెన్స్ అన్నాడు.
My kids are safely recovered from Coronavirus@SPVelumanicbe pic.twitter.com/nXC07q46RI
— Raghava Lawrence (@offl_Lawrence) June 4, 2020