టాలీవుడ్, కోలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రభుదేవా. హీరోగా, దర్శకుడిగా తన టాలెంట్ బయటపెట్టి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. ఆయన ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్లై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు.
తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా జూలై15న విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రమని వారు తెలిపారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే చూసిన జీ నెట్‌వర్క్ టీమ్.. భారీ ధర చెల్లించి ‘మై డియర్ భూతం’ ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం.