ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కరోనాతో కన్నుమూశారు. 1990లో ఆలిండియా రేడియో ద్వారా విశాఖ వాసులకు సుపరిచితం. చిరంజీవి యమకింకరుడు సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 30కి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. సంగీత దర్శకులు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలు, రమేష్ నాయుడు వద్ద 40 చిత్రాలకు సహాయకునిగా పనిచేశారు. బాలీవుడ్‌లో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద కూడా కొంతకాలం సహాయకులుగా పనిచేశారు.
అల్లు అరవింద్ నిర్మించిన బంట్రోతు భార్య సినిమాతో నేపథ్య గాయకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే ఆలిండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి, కోటి, మణిశర్మ ఈయన దగ్గర శిష్యరికం చేయటం విశేషం. తిరుపతిలో ఈయన ప్రదర్శన చూసి ఘంటసాల తన హార్మోనియం బహుమతిగా ఇచ్చారట. అది ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఇంటికి వచ్చిన అతిథులకు దానినే ముందుగా చూపించేవారట.