HomeTelugu TrendingKalki 2898 AD Cameos: కల్కిలో మ్యూజిక్ డైరెక్టర్ క్యామియో ఎవరూ చూసి ఉండరు

Kalki 2898 AD Cameos: కల్కిలో మ్యూజిక్ డైరెక్టర్ క్యామియో ఎవరూ చూసి ఉండరు

Kalki 2898AD
Music director joins the list of Kalki 2898 AD Cameos

Kalki 2898 AD Cameos:

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. దీపిక పడుకొనే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, శాశ్వత చటర్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఒకవైపు సినిమాలో ప్రధాన పాత్రల కోసం భారీ తారాగణం ఎంపిక చేసుకున్న నాగ్ అశ్విన్ సినిమాలోని క్యామియో పాత్రల కోసం కూడా అదే రేంజ్ లో స్టార్లను ఎంచుకున్నారు. చాలామంది స్టార్ నటీనటులు ఈ సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించారు. ప్రతి క్యామియో కి అభిమానులు థియేటర్లు దద్దరిల్లెలా ఎంజాయ్ చేశారు. అయితే సినిమాకి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ కూడా ఈ సినిమాలో కామియో పాత్రలో కనిపించినట్లు చాలా కొంతమందికి మాత్రమే తెలుసు.

సంతోష్ నారాయణన్ తన భార్యతో పాటు సినిమాలో కనిపిస్తారు. కేవలం రెండు మూడు సెకండ్లు మాత్రమే ఈ జంట ఫస్ట్ హాఫ్ లో వచ్చే టాటకర సాంగ్ లో కనిపిస్తారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇక నాగ్ అశ్విన్ కూడా సినిమాలో ఒక క్యామియో పాత్రలో నటించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Kalki 2898 AD Cameos:

ఇక వీళ్ళు మాత్రమే కాక చాలామంది స్టార్ లు సినిమాలో క్యామియో పాత్రలలో కనిపించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, అనుదీప్ తదితరులు కూడా సినిమాలో చిన్న క్యామియో పాత్రలలో కనిపించి అభిమానులను అలరించారు.

రాజేంద్ర ప్రసాద్, మృణాల్ ఠాకూర్ కూడా చిన్న పాత్రలే కాబట్టి వాళ్ళవి కూడా క్యామియో పాత్రలు అని చెప్పుకోవచ్చు. కల్కి సినిమాలో ఇన్ని క్యామియో లతో ఎంటర్టైన్ చేసిన నాగ్ అశ్విన్ ఈ సినిమా రెండవ భాగంలో ఎవరెవరిని తీసుకొస్తాడో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu