HomeTelugu Newsప్రముఖ సంగీత దర్శకుడు మృతి

ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

Music director isaac thomas

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు ఇస్సాక్‌ థామస్‌ కొట్టుకపల్లి (72) గుండెపోటు కారణంగా చెన్నైలో మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. ‘మన్ను’ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన థామస్‌ మలయాళంతో పాటు హిందీ, కన్నడ, తమిళ సినిమాలకు సంగీతం అందించారు. కొడైకెనాల్‌లోని అమెరికన్‌ టీచర్స్‌ స్కూల్‌ నుంచి సంగీత కోర్సు పూర్తి చేసిన తర్వాత, లండన్‌లోని ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో పియానోలో సిక్త్‌ గ్రేడ్‌ సాధించారు. అంతేకాదు..సినీ పరిశ్రమలోని వివిధ రంగాల్లో సేవలు అందించిన థామస్‌ జాతీయ, రాష్ట్ర అవార్డులను కూడా సాధించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu