HomeTelugu Trendingకరోనాతో బాలీవుడ్‌ సంగీత దర్శకుడు మృతి

కరోనాతో బాలీవుడ్‌ సంగీత దర్శకుడు మృతి

Music composer shravan rath
ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) కరోనాతో మృతి చెందారు. మరో సంగీత దర్శకుడు నదీమ్‌తో కలిసి శ్రావణ్ సంగీతాన్ని సమకూర్చేవారు. 1990లలో నదీప్ సైఫీ-శ్రవణ్ కుమార్ రాథోడ్ కలసి నదీమ్ శ్రవణ్ పేరుతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. సూపర్ డూపర్ హిట్ చిత్రాలైన ఆషికి, సాజన్, పరదేశ్, రాజా హిందూస్థానీ వంటి అనేక చిత్రాలకు వీరే సంగీతాన్ని అందించారు. ఇటీవల శ్రావణ్ కు కరోనా సంక్రమించింది. ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత రాత్రి 10.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సంజీవ్ వెల్లడించారు. శ్రావణ్ కుమారులైన సంజీవ్, దర్శన్ కూడా సంగీత దర్శకులుగానే స్థిరపడ్డారు. శ్రవణ్ మృతిపై నదీమ్ స్పందించారు. తన శాను ఇక లేడని… ఇద్దరం కలిసి ఎన్నో ఎత్తు పల్లాలను చూశామంటూ భావోద్వేగానికి గురయ్యాడు. శ్రవణ్ కుమార్ రాథోడ్ మృతిపై పలువరు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu