దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఆయా రాష్ట్రాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కూడా తన వంతు ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను ఆయన కలిశారు. రూ.25 లక్షలను విరాళంగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఇటీవల తమిళ స్టార్ హీరోలు సూర్య బ్రదర్స్ సైతం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటిని విరాళంగా అందచేసిన విషయం తెలిసిందే.