ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ఓ క్రేజీ మల్టీస్టారర్ రూపకల్పనకు పథక రచన చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో మురుగదాస్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. ఈ మూవీకి స్టోరీ లైన్ కూడా సిద్ధమైందని సమాచారం. మహేష్ ఈ సినిమాలో సీబీఐ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా.. కమల్ హాసన్ ఓ యువతి తండ్రి పాత్రలో కనిపిస్తాడని టాక్. ఇందులో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి సైతం ఓ కీలకపాత్ర పోషించబోతోందట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలి అంటే దీనిపై డైరెక్టర్ స్పందించేవరకు వేచి చూడాలి. కాగా ఇప్పటికే మురుగుదాస్ గతంలో మహేష్‌తో స్పైడర్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కమర్షియల్స్‌గా అంతగా సక్సెస్ అందుకోలేదు.