టాప్ డైరెక్టర్ మురుగదాస్, సూర్య కాంబినేషన్లో సూపర్ హిట్ కొట్టిన సినిమా ‘గజినీ’. 15 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ గజినీ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రూ.100 కోట్లు సాధించిన మొదటి సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ రానుందని తెలుస్తుంది. ఇప్పుడు గజినీ సినిమాకు సీక్వెల్ తీయాలని మురగదాస్‌తో అమీర్‌ఖాన్ చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు మురుగదాస్ కూడా ఓకె చెప్పినట్లు సమాచారం. ముందుగా ఈ సినిమాను తమిళంలో తీయాలని తమిళ తంబీలు అడ్డుపడుతున్నారట. సౌత్‌లో హిట్ అయిన మూవీకి అక్కడ సీక్వెల్ ఎలా తీస్తారు. మురుగదాస్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ తమిళ తంబీలు కోరుతున్నారట. కానీ మురుగదాస్ మాత్రం హిందీ లో సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.