Murali Mohan comments on AP politics: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దిక్కులేని విధంగా మారిందని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ, టాలీవుడ్ నటుడు మురళీమోహన్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఈ రోజు ‘హోరెత్తిన ప్రజాగళం’ గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్, జ్యోత్స్న తిరునగరి, శ్రీనివాసరావు పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ… 5 ఏళ్లుగా ఏపీ అభివృద్ధిలో వెనకపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లల్లో ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో దోపిడీ పెరిగిపోయిందని మండిపడ్డారు.
ఏపీ బాగుపడాలంటే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం.. అన్ని రంగాల్లో వెనకపడటానికి కారణం అయిందని అన్నారు. రాష్ట్ర బాగుకోసం మంచి నాయకుడైన చంద్రబాబుని సీఎంగా ఎన్నుకోవాలని చెప్పారు.
ఉచితాలకు బదులు ఉపాధి మార్గం చూపితే ప్రజల జీవితం మెరుగుపడుతుందని అన్నారు. ఉచితాల వల్ల ప్రయోజనం ఉండదని మురళీమోహన్ అన్నారు.