బాలీవుడ్ ప్రేమపక్షులు లాక్‌డౌన్ సమయంలో బాంద్రాలో విహరిస్తూ ముంబై పోలీసులకు చిక్కారు. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీపై ముంబై పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిద్దరూ లవ్‌బర్డ్స్ అని బాలీవుడ్‌లో తరచూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో టైగర్ ష్రాఫ్, దిశాపటానీ ఫొటోలు మాత్రం షేర్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరు ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. ఆ సమయంలో వీరి కారును బాంద్రా వద్ద
పోలీసులు ఆపారు. సరైన కారణం లేకుండా బయటకు వచ్చి లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో కేసు నమోదుచేశారు.
#FIR against #DishaPatani and #TigerShroff for allegedly violating #Covid19 norms in #Mumbai. They were pulled over by cops at Bandstand for roaming in the city after 2 pm.@DishPatani @dishpatanicafe @DishaPataniFans @iTIGERSHROFF https://t.co/IV11xYZxHK
— India.com (@indiacom) June 3, 2021