HomeOTT2 రోజుల్లో OTT లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

2 రోజుల్లో OTT లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

Much awaited OTT releases in the next 2 days
Much awaited OTT releases in the next 2 days

OTT Releases this week Telugu:

ప్రజలు ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లి సినిమాలు చూసేది తక్కువ అయిపోయింది అని కొందరు చెబుతూ ఉంటారు అందులో నిజం ఎంత ఉందో కానీ ఓటీటీలు వచ్చాక ప్రతి వారం బోలెడు సినిమాలు వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నాయి. ఈవారం కూడా చాలానే సినిమాలు విడుదలవుతున్నాయి.

ఇప్పటికే భారతీయుడు 2 సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన మరికొన్ని తెలుగు సినిమాలు ఇప్పుడు OTT లో స్ట్రీమ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఒక రెండు రోజుల్లో ఓటీడీలలో ప్రత్యక్షం అవ్వనున్న తెలుగు సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

డార్లింగ్:

ప్రియదర్శి హీరోగా.. నభా నటేష్ హీరోయిన్గా.. అపరిచితుడు ఫిమేల్ వర్షన్ లాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. థియేటర్లలో ఈ సినిమాకి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. రేపు అంటే ఆగస్టు 13 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవబోతోంది.

మనమే:

శర్వానంద్ హీరోగా.. కృతి శెట్టి హీరోయిన్గా వచ్చిన రొమాంటిక్ డ్రామా మనమే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ గా కూడా మంచి కలెక్షన్లు అందుకుని హిట్ అయిన సినిమా ఇది. ఈ సినిమా 16వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది.

వీరాంజనేయులు విహార యాత్ర: 

నరేష్ నటించిన ఈ వెబ్ సిరీస్ లో బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇచ్చారు. చనిపోయిన వారి అస్తికలు కలపడం కోసం ఒక కుటుంబం గోవా వెళ్ళే కాన్సెప్ట్ మీద నడిచే కథ ఇది. ట్రైలర్ తో బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ కాబోతోంది.

ఇది మాత్రమే కాకుండా తమిళ్ సినిమా మనోరతంగల్ కూడా 15వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమ్ కాబోతోంది. హిందీలో కూడా పరిణీత, శేఖర్ హోమ్ వంటివి విడుదల కాబోతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu