టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోనీ: ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమాలో మరో నటుడు సందీప్ నహర్ నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబై, గోర్గావ్ ప్రాంతంలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేశాడు. సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు. వ్యక్తిగత సమస్యలు, భార్యతో విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. పరిస్థితులను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ విషయంలో తన భార్యను నిందించవద్దని కోరాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారకులు కారని పేర్కొన్నాడు. ఫేస్బుక్లో అతడి పోస్టు చూసిన వెంటనే స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆత్మహత్యను ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 33 ఏళ్ల ఈ నటుడి సూసైడ్ వ్యవహారం సంచలనంగానే కాదు.. అందరిని కలిచివేస్తోంది. ఈ సినిమాలో ధోనీ పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే తెలిసిందే. ఇప్పుడు ఈ ఆత్మహత్య అభిమానులను కల్చివేస్తుంది.