Mrunal Thakur: టాలీవుడ్‌లో ‘సీతారామం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకూర్. తొలి సినిమాతోనే ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాలో ఆమె జమీందార్ వారసురాలిగా కనిపించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’లో నటించింది. ఈ సినిమా సీతారామం అంత హిట్ ఇవ్వకపోయిన.. మంచి వసూళ్లతో సూపర్ హిట్‌ని ఖాతాలో వేసింది. ఈ సినిమాలో.. రిచ్ గర్ల్ గా మెప్పించింది. తాజాగా హ్యాట్రిక్ మూవీగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మృణాల్ వేల కోట్ల ఆస్తులున్న మిలియనీర్ గా కనిపించింది. ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీతో ఆమెకు తొలిసారిగా ఫ్లాప్ ఎదురైంది.
దీంతో మృణాల్ గట్టి షాక్ తగిలింది అనే చెప్పాలి. అయితే ఇక్కడ గమనించ వాల్సిన విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ మృణాల్ నటించిన అన్నీ సినిమాల్లోనూ డబ్బున్న అమ్మాయిగానే చేసింది. సీతారామంలో జమీందార్ వారసురాలిగా, హాయ్ నాన్నలో రిచ్ గర్ల్ గా, ది ఫ్యామిలీ స్టార్ లో మిలియనీర్ గా దర్శనమిచ్చింది.
అయితే స్టార్టింగ్ నుండి ఇటువంటి క్యారెక్టర్లే చేయడం వల్ల మాస్ కి దూరమయ్యే రిస్క్ లేకపోలేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. నేషనల్ క్రమ్ రష్మిక మందన్న తొలుత.. ఛలో, భీష్మలో ఎంత క్లాస్ గా కనిపించినా ఆతరువాత.. పుష్పలో నా సామీ అంటూ ఊర మాస్ లుక్‌లో అదరగొట్టేసింది.
పూజా హెగ్డే కూడా మృణాల్ లాగే ఓన్లీ రిచ్ గా కనిపించి తర్వాత ఒకే టెంప్లేట్ లా అనిపించడంతో పాటు వరుస పరాజయాలు టాలీవుడ్‌కి దూరం అయింది. సో మృణాల్ ఠాకూర్.. విషయంలో కూడా ఇలా జరగకుండా ఉండాలంటే తన వే మార్చుకోవాలి. మిడిల్ క్లాస్ పాత్రల్లో.. పక్కింటి అమ్మాయిగా అటు ఫ్యామిలీ, మాస్ ఆడియాన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యే పాత్రల్లో ఒదిగిపోవాలి.
అప్పుడే కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం మృణాల్ తెలుగులో సినిమాలు ఏమీ ప్రకటించలేదు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి. హను రాఘవపూడి చేయబోయే ప్రభాస్ సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.