టాలీవుడ్‌లో ‘సీతారామం’ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మృణాల్ ఠాకుర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది. తాజాగా మృణాల్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ ఇంటర్య్వూలో మృణాల్‌కు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది.
దీనిపై ఆమె స్పందిస్తూ..సమాజంలో ప్రతి మహిళకు ఇలాంటి ఓ ప్రశ్న ఎదురౌతుంది. మహిళ పెళ్లి, ప్రేమ, పిల్లలు వంటి విషయాలపై సమాజం ఆసక్తి కనబరుస్తుంది. నా విషయంలో నాజీవితాన్ని అర్థం చేసుకోనే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. నేను ఇండస్ట్రీలోనే ఉంటాను. ఆ లైఫ్ ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. వాటిని అర్థం చేసుకుని నన్ను ముందుకు నడిపించేవాడినే నేను వివాహం చేసుకుంటున్నాను. అలాంటి వ్యక్తితోనే పిల్లల్ని కంటాను. నిజం చెప్పాలంటే నాకు పెళ్లి కంటే ముందే పిల్లల్ని కనాలని ఉంది. ప్రేమ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. జీవితంలో అలాంటి అభిప్రాయం వస్తే.. ప్రేమ గురించి ఆలోచిస్తా.. అని చెప్పుకొచ్చింది. 30 ఏళ్ళ వయస్సులో ఏ స్త్రీ కెరీర్ కన్నా పెళ్లి, ప్రేమ, పిల్లలపై ఆసక్తి చూపించరు అని చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.