HomeTelugu Trendingడెవిల్‌కు ఆ బాలీవుడ్ బ్యూటీ నో చెప్పిందా?

డెవిల్‌కు ఆ బాలీవుడ్ బ్యూటీ నో చెప్పిందా?

mrunal

నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన డెవిల్ మూవీ చుట్టూ ఎన్ని వివాదాలు అల్లుకున్నాయ్ అందరికీ తెలిసిందే. మొదట్లో దర్శకుడిగా నవీన్ మేడారం పేరు కనిపించింది.. చివరకు వచ్చేసరికి దర్శక నిర్మాతగా అభిషేక్ నామా పేరు పడింది. నవీన్ మేడారం హ్యాండిల్ చేయలేకపోవడంతో రెండో రోజు నుంచే పక్కన పెట్టేశామని నిర్మాత చెబుతాడు. సినిమాకు 105 రోజులు పని చేశానని నవీన్ చెబుతుంటాడు. ఇలా ఏది ఏమైనా కూడా డెవిల్ ఫలితం మాత్రం ఆశించినంతగా రాలేదు.

డెవిల్ ఫలితం ఎటూ తేలకుండా రావడంతో దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. పూర్తిగా డిజాస్టర్ అయినా.. లేదా పూర్తిగా బ్లాక్ బస్టర్ అయినా దర్శక నిర్మాతల మధ్య మరింత వివాదం తలెత్తేది. ఇవన్నీ ఇలా ఉంచితే.. ఈ డెవిల్ సినిమాకు మృణాల్ ఠాకూర్‌ను అనుకున్నారట. కానీ మృణాల్ మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పేసింది. అయినా మృణాల్ ఈ సినిమా చేసి ఉంటే ఆమె ఖాతాలో ఓ ఫ్లాప్ పడినట్టు అయ్యేది. సీతారామం తరువాత డెవిల్ వంటి సినిమాకు నో చెప్పి మృణాల్ మంచి పనే చేసినట్టు అయింది.

సంయుక్త మీనన్ రేంజ్‌లో ఈ సినిమా హిట్టన్నట్టే. సంయుక్తకు వరుసగా మంచి సినిమాలే పడుతున్నాయి. కానీ ఆమెకు మాత్రం స్టార్ స్టేటస్ రావడం లేదు. సార్, విరూపాక్ష ఇలా మంచి హిట్లే పడుతున్నాయి. కానీ డెవిల్ ఫలితం సంయుక్త కెరీర్‌కు ఏమంతగా ఉపయోగపడలేదు. మొత్తానికి మృణాల్ నిర్ణయం మాత్రం సరైనదే అని డెవిల్ నిరూపించింది.

అసలే మృణాల్ సినిమాను ఎంచుకునే టైంలో కథ, కథనాలు.. మరీ ముఖ్యంగా తన పాత్రకు ఉండే ప్రాధాన్యం ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే. మృణాళ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను చేస్తుంది. సీతారామం తరువాత నానితో చేసిన హాయ్ నాన్న మంచి హిట్టుగా నిలిచి మృణాల్‌కు మరింత క్రేజ్‌ను తెచ్చి పెట్టింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu