Mrunal Thakur:- మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. హిందీలో సీరియల్స్ లో తన కెరియర్ ప్రారంభించిన.. ఈ నటి ఆ తరువాత ఎన్నో సినిమాలలో కూడా నటించింది. అయితే ఈ హీరోయిన్ కి తెలుగులో చేసిన సీతారామం సినిమా మంచి విజయం అందించింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ తరువాత మృణాల్ నానితో చేసిన హాయ్ నాన్న కూడా ఆమెకు మంచి విజయం అందించింది. అయితే ఈ మధ్య విజయ్ దేవరకొండ తో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం దిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ తదుపరి సినిమా రాఘవ లారెన్స్ లో ఉండబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి. రాఘవ లారెన్స్ కి కాంచన సిరీస్ మంచి విజయాన్ని అందించాయి. అయితే కాంచన 4 త్వరలోనే తీయబోతున్నారు ఈ దర్శకుడు. ఈ క్రమంలో ఈ చిత్రంలో హీరోగా కూడా నటిస్తున్న రాఘవ లారెన్స్ పక్కన.. మృణాల్ కనిపించనుంది అని వినికిడి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
https://x.com/Mrunalthakur24/status/1801489838362739008
ఒక క్రికెటర్ ని విపరీతంగా ప్రేమించాను అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. మృణాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విరాట్‌పై తన ప్రేమను వ్యక్తపరిచింది. తాను ఒకప్పుడు కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డానంటూ..చెప్పుకొచ్చారు. కాగా తన తమ్ముడు కారణంగా తాను క్రికెట్ చూడటం ప్రారంభించానని.. బ్లూ జెర్సీ.. ధరించి టీమిండియాను ఉత్సాహపరిచేందుకు.. స్టేడియానికి వెళతామని గుర్తు గుర్తుచేసుకుంది. ఆ సమయంలోనే కోహ్లీ బ్యాటింగ్‌కు పెద్ద ఫ్యాన్ అయిపోయానని తెలిపింది.
ఇక అప్పట్లో కోహ్లీని చూసి తను ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. అయితే కోహ్లీకి.. అనుష్క శర్మతో పెళ్లయిన సంగతి తెలిసిందే. ఇక మృణాల్…కోహ్లీతో బిజీగా ప్రేమలో పడ్డాను అని చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్తగా వైరల్ అవుతున్నాయి.