HomeTelugu Big StoriesMrunal Thakur: ఆ విషయం ఆలోచిస్తే భయంగా ఉంటుంది

Mrunal Thakur: ఆ విషయం ఆలోచిస్తే భయంగా ఉంటుంది

Mrunal thakur interesting comments in
latest interviewMrunal Thakur: టాలీవుడ్‌లో సీతారామం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో.. తెలుగు లో ఈ బ్యూటీకి వరుస అవకాశలు వచ్చాయి. ఇటీవలే విడుదలైన ‘హాయ్ నాన్న’ కూడా బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీగా ఉంది ఈ అమ్మడు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’‌ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్, పెళ్లి, సినిమాలు, కష్టాలు, కో యాక్టర్స్ ఇలా పలు ఆసక్తికర విషయాల పంచుకుంది మృణాల్‌.

యాక్టర్ అవ్వాలనే ఆలోచనే తనకి లేదని.. అనుకోకుండా.. ఓ ఆడిషన్స్‌కి వెళ్లి.. సెలక్ట్ అయి తన ఫ్రెండికి షాకిచ్చిందట మృణాల్. అయితే చిన్నప్పటి నుంచి మిస్ వరల్డ్ అవ్వాలనే కోరిక మాత్రం మృణాల్‌కి ఉండేదట. కానీ బికినీ వేసుకోవాల్సి వస్తుందేమోననే భయంతో దాని జోలికి వెళ్లలేదంటూ చెప్పుకొచ్చింది.

Mrunal thakur i1 Mrunal Thakur,Family Star,Vijay Devarakonda,Mrunal Thakur latest interview

హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ అంటే తనకి చాలా ఇష్టమని.. చిన్నప్పుడు వాళ్ల ఫొటోలు బెడ్ రూమ్ గోడపై కూడా అంటించినట్లు చెప్పింది మృణాల్. ఇప్పుడు వాళ్ల పక్కన నటించే స్థాయి రావడం ఆనందంగా ఉంది అని తెలిపింది. సూపర్ 30లో హృతిక్‌తో, జెర్సీలో షాహిద్ కపూర్‌తో కలిసి పని చేయడం తన అదృష్టమని తెలిపింది.

సీతారామం సినిమాలో రామ్ లాంటి అబ్బాయిలంటే చాలా ఇష్టమని, రియల్‌ లైఫ్‌లో రామ్ లాంటి కుర్రాళ్లు ఉంటే వెంటనే వచ్చి నన్ను కలవండి. మీ కోసం రింగ్ కూడా రెడీగా ఉంది”అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. పెళ్లికి ముందు సెక్స్‌ “అది వారివారి వ్యక్తిగత అభిప్రాయం, ఇద్దరి ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. అలానే వాళ్లు పుట్టి పెరిగిన వాతావరణంపై కూడా అది ఆధారపడి ఉంటుంది. ఎవరి అభిప్రాయాన్ని తప్పు, ఒప్పు అని చెప్పే అధికారం నాకు లేదు” అంటూ మృణాల్ చెప్పింది.

Mrunal thakur interesting c Mrunal Thakur,Family Star,Vijay Devarakonda,Mrunal Thakur latest interview

సెలబ్రెటీ అవ్వడం వల్లే కదా ఇంతమంది అభిమానం దొరికింది అని ఆనందపడతాను. కానీ కొన్నిసార్లు నాక్కూడా ఒక నార్మల్ లైఫ్ గడపాలనిపిస్తుంది. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని, పిల్లలను కని, అనుకున్నప్పుడు డిన్నర్‌ కోసం రెస్టారంట్‌కు వెళ్లి రావొచ్చు. ఎలాంటి పరిమితులు ఉండవ్ కదా” అంటూ చెప్పుకొచ్చింది. “మరణం గురించి ఆలోచిస్తే భయంగా ఉంటుంది.. నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుందా? అని ఎక్కువగా ఆలోచిస్తుంటా” అని ఆన్సర్ ఇచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాలో తన పాత్ర చాలా బావుంటుందని ఖచ్చితంగా అందరూ థియేటర్లో చూడాలంటూ కోరింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu