తెలుగులో సీతారామం మూవీతో ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. ఫస్ట్ మూవీతోనే హిట్ సొంతం చేసుకుంది మృణాల్. సీతారామం మూవీలో సీత పాత్ర ద్వారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
మృణాల్ ప్రస్తుతం హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూవీస్ చేస్తోంది. అయితే తాజాగా మృణాల్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి ఏర్పాటు చేసిన దీపావళి స్పెషల్ పార్టీలో సందడి చేసింది మృణాల్.
పార్టీ తర్వాత ప్రముఖ సింగర్ బాద్షాతో కలిసి ఆమె చేయి పట్టుకుని వెళ్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాద్షాతో మృణాల్ డేటింగ్లో ఉందని అందుకే వారిద్దరు కలిసి వెళ్లారని రూమర్స్ విపరీతంగా ప్రచారం అవుతున్నాయి.
తనపై జరుగుతున్న రూమర్స్‌పై ఇన్‌స్టాలో స్పందించింది మృణాల్ ఠాకూర్. బాద్షా, ప్రియమైన ఇంటర్నెట్, మీరు మీ మనసులో ఏదయితే అనుకుంటున్నారో అది ఏమాత్రం నిజం కాదు అంటూ లాఫింగ్ ఎమోజిని పోస్ట్ చేసింది మృణాల్. దీనితో ఈ పుకార్ల పై క్లారిటీ రావడం జరిగింది.