బిగ్‌బాస్ ఫేమ్ సొహెల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రాన్ని అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఫన్ అండ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటోంది. సరదాగా ఆడుతూ పాడుతూ లైఫ్‌ను హ్యాపీగా గడిపే కుర్రాడు… ప్రేమ, పెళ్లి అంతలోనే ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్‌ను ఎదుర్కొంటాడు.
ఓ మగవాడు గర్భం దాలిస్తే.. ఎలా ఉంటుందో అన్న అంశంతో సినిమాను తెరకెక్కించినట్లు చూపించారు. అతడు ప్రెగ్నెంట్ కావడం, అతడు ఎలాంటి అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది ట్రైలర్‌లో చూపించారు. సోహెల్ నటన బాగుంది. మరి ఈ సినిమా అతనికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
ఈ సినిమాలో సుహాసిని, బ్రహ్మాజీ, రజా రవీంద్ర, అలీ, అభిషేక్ రెడ్డి, వైవా హర్ష, స్వప్నిక తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.