HomeTelugu News'మిస్టర్‌ మజ్ను' ట్రైలర్‌..!

‘మిస్టర్‌ మజ్ను’ ట్రైలర్‌..!

1 19అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ మజ్ను’ ట్రైలర్‌ విడుదలైంది. అమ్మాయిలతో అఖి్‌ ల్‌ ఫ్లర్ట్‌ చేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. అప్పుడు అతనికి హీరోయి నిధి అగర్వాల్‌ పరిచయం అవుతుంది. ఆమె ఏది చేస్తే దానిని అనుకరిస్తూ ఫాలో అవుతుంటాడు. అప్పుడు నిధికి కోపం వచ్చి ‘నువ్వెంత ట్రై చేసినా నేను పడను’ అంటుంది. ఇందుకు అఖిల్‌ ‘థాంక్స్‌’ అంటాడు. ‘థాంక్స్‌ ఎందుకు?’ అని నిధి అడుగుతుంది. ‘అప్పుడు నేను హాయిగా ఇంకో అమ్మాయిని ట్రై చేసుకుంటాను’ అని అఖిల్‌ చెప్పడం హైలైట్‌గా నిలిచింది.

అఖిల్‌, నిధి మధ్య కెమిస్ట్రీని చాలా అందంగా చూపించారు. ‘నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ నా వల్ల ఒక్కరు ఏడ్చినా కచ్చితంగా అది నా తప్పు అవుతుంది’ అని అఖిల్‌ నిధితో అంటున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌ చివర్లో ‘ప్రేమ అంటే..ఎక్కువ రోజులు ప్రేమించుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా ప్రేమించుకుని లాస్ట్‌లో పెళ్లిచేసుకోవడం లాంటిదా?’ అని అఖిల్‌ నిధిని అడుగుతాడు. ఇందుకు నిధి అవునంటుంది. అప్పుడు అఖిల్‌ ‘చచ్చాను.. అలా ప్రేమించడం నా వల్ల కాదు’ అని చెప్పడం ఫన్నీగా ఉంది. వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్‌ సంగీతం అందించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియదర్శి, రావు రమేశ్‌, సితార, నాగబాబు కీలక పాత్రలు పోషించారు. శనివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక అట్టహాసంగా జరిగింది. వేడుకకు నాగార్జున, నాగచైతన్యతో పాటు ఎన్టీఆర్‌ కూడా అతిథిగా విచ్చేసి సందడి చేశారు. 25న ‘మిస్టర్‌ మజ్ను’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu